ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్

Telugu Lo Computer
0


జార్ఖండ్ కాంగ్రెస్ లో కార్లలో నోట్ల కట్టల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. శనివారం రాత్రి జమ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ, ఖిజ్రీ ఎమ్మెల్యే రాజేష్ కచ్చప్, కొలెబిరా ఎమ్మెల్యే నమన్ బిక్సల్ కొంగరిలు తమ కార్లలో నోట్లకట్టలతో వెళ్తుండగా బెంగాల్ లోని హౌరా పోలీసులు పట్టుకున్న విషయం విధితమే. వారి కార్లలోని రూ.49 లక్షల నగదును సీజ్ చేసి ముగ్గురు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం జార్ఖండ్ కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. అంతేకాక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది. గిరిజనుల పండుగకు చీరలు కొనుగోలు చేసేందుకు నగదును తీసుకువెళుతున్నామని ఎమ్మెల్యేలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులకు పట్టుబడిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, జార్ఖండ్ ఇన్‌చార్జి అవినాష్ పాండే మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముగ్గురు ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)