తక్కువ ధర మొబైల్‌ డేటాలో భారత్‌ కు ఐదవ స్థానం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 July 2022

తక్కువ ధర మొబైల్‌ డేటాలో భారత్‌ కు ఐదవ స్థానం


యూకేకి చెందిన 'కేబుల్‌.కో.యూకే' అనే టెలికాం సంస్థ 233 దేశాల్లో 1జీబీ డేటా ధర ఎంత ఉందనే అంశంపై ఓ డేటాను విడుదల చేసింది. అందులో మొబైల్‌ డేటా తక్కువ ధరకే లభ్యమయ్యే 5 దేశాల్లో భారత్‌కు 5వ స్థానం దక్కింది. ఆ 5దేశాల్లో ఇజ్రాయిల్‌ దేశం 1జీబీ డేటాను 0.04 డాలర్లు (భారత్‌ కరెన్సీలో రూ.3.20), ఇటలీ 0.12 డాలర్లు(రూ.9.59), శాన్ మారినో 0.14 డాలర్లు (రూ.11.19), ఫిజి దేశంలో 1జీ డేటా 0.15 డాలర్ల (రూ.11.99), భారత్‌ 0.17 డాలర్ల (రూ.13.59)తో వరుస స్థానాల్లో నిలిచాయి. కేబుల్‌.కో.యూకే నివేదిక మొబైల్‌ డేటా ధర ఎక్కువగా ఉన్న 5 దేశాల జాబితాను విడుదల చేసింది. అందులో 1జీబీ డేటాను 41.06 డాలర్ల (రూ.3,323.92)కు అత్యధికంగా అమ్ముడవుతున్న దేశాల జాబితాలో సెయింట్ హెలెనా ప్రథమ స్థానలో నిలిచింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఫల్క్‌ ల్యాండ్‌ దీవుల్లో 38.45 డాలర్లు (రూ.3,072.11) , సెంట్రల్‌ ఆఫ్రికా దేశమైన సెయింట్ థామస్ (São Tomé) ప్రిన్సిపి (principe)లో 29.49 డాలర్లు ( రూ.2,356) , టోకెలావ్ (Tokelau )లో 17.88 (రూ.1428) , యెమన్ దేశంలో 16.58 డాలర్ల (1324.72) ధరతో వరుస స్థానాల్లో నిలిచాయి.

No comments:

Post a Comment