'లవ్ జీహాదీ' కుట్ర !

Telugu Lo Computer
0


ఢిల్లీకి చెందిన హిందూ యువతిని అడ్డం పెట్టుకుని 27 ఏళ్ల ముస్లిం వ్యాపారవేత్తను యూపీలోని  కస్‌గంజ్‌లో 'లవ్ జీహాద్' కేసులో ఇరికించేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. ఇందులో ఒకరు బీజేపీ యూత్ వింగ్ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌గా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాధా అనే ఈ యువతి ప్రిన్స్ ఖురేషి అనే ముస్లిం యువకుడు తనను తాను మోనూ గుప్తగా పరిచయం చేసుకున్నాడని, కొన్నాళ్లు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి పేరుతో తనను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఖురేషిపై ఐపీసీ సెక్షన్స్ 376, 323, 506 సెక్షన్ల కింద జులై 16న కేసు నమోదు చేశారు. అయితే.. అతనిపై పూర్తి సత్య దూరమైన ఆరోపణలు చేసిన రాధ కోర్టులో తన ఆరోపణలు అబద్ధం అని తేలితే జైలుకెళ్లక తప్పదని భయపడింది. నిజ నిర్ధారణ పరీక్ష చేస్తే తాను దొరికిపోతానని గ్రహించిన రాధ చివరకు ఆ ఆరోపణలు ఇద్దరు వ్యక్తులు చేయించారని అసలు విషయం బయటపెట్టింది. తనతో సదరు ముస్లిం యువకుడిపై చౌహాన్, సోలంకి అనే ఇద్దరు వ్యక్తులు 'లవ్ జీహాద్' ఆరోపణలు చేయించారని రాధ అనే ఈ యువతి పేర్కొంది. దీంతో ఈ కుట్రకు పాల్పడినందుకు చౌహాన్, సోలంకి, రాధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖురేషి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు స్టేషన్‌లో రాధ ఫిర్యాదు చేసిన సమయంలో చౌహాన్, సోలంకి కలిసి 200 మందికి పైగా మితవాద కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ ముందు రాధకు న్యాయం చేయాలని నిరసనకు దిగడం కొసమెరుపు. ఈ కేసుపై కస్‌గంజ్ ఎస్పీ బీబీజీటీఎస్ మూర్తి స్పందిస్తూ తమ విచారణలో సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేసినట్లు తేలిందని చెప్పారు. వైద్య పరీక్షలకు వెళ్లేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసిందని.. చివరకు అసలు విషయం బయటపెట్టిందని తెలిపారు. ఆ ఇద్దరు వ్యక్తులకు, ఖురేషికి మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నాయని తమ విచారణలో తెలిసిందని చెప్పారు. ఆ కారణంగానే ఖురేషిని దెబ్బ కొట్టాలనే కుట్రతో సోలంకి, చౌహాన్ కలిసి 'లవ్ జీహాద్'కు కుట్ర పన్నారని.. ఆ కుట్రలో రాధను పావుగా వాడుకున్నారని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)