పంజాబ్ లో 300 యూనిట్ల ఉచిత విద్యుత్

Telugu Lo Computer
0


పంజాబ్ నూతన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే పనిలో నిమగ్నమైంది. శుక్రవారం నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ఆయన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. 'గత ప్రభుత్వాలు ఎన్నికల కోసం ప్రమాణాలను వాడుకున్నాయి. ఆ తర్వాత ఐదేళ్లు వాటిని అమలు చేస్తామని గడిపాయి. కానీ, ఆప్ ప్రభుత్వం మాత్రం వాటిని నెరవేరుస్తూ పంజాబ్ లో చరిత్ర సృష్టిస్తోంది. నేడు మేము పంజాబీలకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నాం. శుక్రవారం నుంచి ప్రతి పంజాబ్ కుటుంబానికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది' అని పేర్కొన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ తర్వాత ఉచిత విద్యుత్ ను ప్రజలకు అందిస్తున్న రాష్ట్రంగా పంజాబ్ నిలిచిందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై రూ.1800 కోట్ల అదనపు భారం పడనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)