ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడిలో 18 మంది మృతి

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ పోర్టు నగరమైన ఒడెసాపై రష్యా క్షిపణి దాడి చేసింది. నగరంలోని తొమ్మిది అంతస్తుల భవనంపై జరిగిన క్షిపణి దాడిలో దాదాపు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. నల్లసముద్రంలోని స్నేక్ ఐల్యాండ్ నుంచి తమ బలగాలను ఉపసంహరించినట్లు రష్యా ప్రకటన చేసిన మరుసటి రోజే రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడడం గమనార్హం. తెల్లవారుజామున 9 అంతస్తుల భవనంపై ఈ దాడి జరగ్గా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం పాక్షికం కుప్పకూలి పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒడెసాలోని రిక్రియేషన్‌ సెంటర్‌పైనా రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో మరో ముగ్గురు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది. రష్యా దాడులను తప్పించుకునేందుకు భూగర్భ స్థావరాల్లో ఉక్రెయిన్‌ వాసులు తలదాచుకుంటున్నారు. గత రెండు వారాలతో పోలిస్తే రష్యా దాడులు మరింత పెరిగనట్లు ఉక్రెయిన్‌లోని రక్షణ వర్గాలు వెల్లడించాయి. అయితే పౌరులపై దాడి చేశామన్న ఉక్రెయిన్‌ అధికారుల ఆరోపణలను రష్యా ఖండించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)