మందు లేనిదే ముద్ద ముట్టని కోడిపుంజు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 5 June 2022

మందు లేనిదే ముద్ద ముట్టని కోడిపుంజు


మహారాష్ట్ర భందారా జిల్లాలోని పునరావాస గ్రామం పిప్రీకి చెందిన భావుకాతోరే అనే వ్యక్తికి కోళ్ల పెంపకంపై ఆసక్తి ఎక్కువ. పలు రకాల కోళ్లను పెంచుతుంటాడు. అయితే ఓ కోడిపుంజు మాత్రం ఇంట్లో మనిషిలాగానే ఉంటుంది. భావుకాతోరే సైతం ఆ కోడిపుంజుకు ఇంట్లోని మనుషుల వలే ఇష్టమైన ఆహారాన్ని అందిస్తాడు. అయితే ఓ రోజు కోడి పుంజు అనారోగ్యానికి గురైంది. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న కోడిపుంజుకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి సూచన మేరకు మద్యంను పట్టించాడు. కొద్దిరోజులకే కోడిపుంజు కోలుకొని మళ్లీ యథావిధిగా తిరగడం మొదలు పెట్టింది. ఆ కోడిపుంజు యాజమానికి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఓ రోజు కోడి పుంజుకు ఆహారాన్ని అందించాడు. అయితే అది ముట్టుకోలేదు. రోజంతా అలానే ఉంది. మంచినీరు పెట్టినా తాగలేదు. దీంతో మరుసటి రోజు కోడిపుంజుకు మద్యాన్ని అందించే సరికి గటగటా తాగేసి వెంటనే ఆహారాన్ని తీసుకుంది. ఖంగుతిన్న యాజమాని మద్యానికి బానిసైందని గుర్తించాడు. కోడిపుంజుకోసమని ప్రత్యేకంగా మందు తెప్పించి ప్రతిరోజూ కొంచెం పోసి దానికి ఆహారం అందిస్తున్నాడు. ఈ విచిత్ర ఘటన చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. అయితే కోడి పుంజుకు కేవలం మద్యం అందించేందుకు యాజమానికి నెలకు రూ.2వేలు ఖర్చు అవుతుంది. ఖర్చు భరించలేని భావుకాతోరే పశువైద్యాధికారిని సంప్రదించాడు. అయితే ఆల్కహాల్​లా వాసన వచ్చే విటమిన్​ ట్యాబ్లెట్లు ఇవ్వటం ప్రారంభించాలని పశువైద్యాధికారి సూచించారు.

No comments:

Post a Comment