జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 5 June 2022

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి ?జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక గుల్బర్గాలో మైనర్‌ను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లో గల ఫాం హౌస్ వద్ద ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్‌లో తలదాచుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచే వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారు. ఇన్నోవా కారును ఆ ఫాం హౌస్ వెనుక దాచినట్టు సమాచారం.నిందితులు ఫోన్లలో తమ సిమ్ కార్డులను వేసి వారిని గోవాకు పంపించారని, ఆ తర్వాత వీళ్లు కర్ణాటకకు పారిపోయారని సమాచారం. నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఫాం హౌస్ యజమాని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసులో ఓ నిందితుడి తండ్రి అయిన చైర్మన్ దే ఆ ఫాం హౌస్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. మరో నిందితుడు ఉమేర్ ఖాన్‌ను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

No comments:

Post a Comment