జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ

Telugu Lo Computer
0


రిలయన్స్ గ్రూప్​ అధినేత ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్‌గా  రాజీనామా చేశారు. ఆ కంపెనీ ఛైర్మన్ బాధ్యతలను తన తనయుడు ఆకాశ్​ అంబానీకి అప్పగించారు. ఇప్పటివరకు రిలయన్స్​ జియోలో నాన్​-ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా ఉన్న ఆకాశ్ అంబానీని రిలయన్స్ జియో కొత్త ఛైర్మన్‌గా నియమించారు. రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జూన్ 27న జరిగింది. ఈ సమావేశంలో బోర్డు అనేక నిర్ణయాలను తీసుకుంది. ఇక్కడే ఆకాశ్ అంబానీ కంపెనీ ఛైర్మన్​గా నియమిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదముద్రవేశారు. ఈ వివరాలను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కంపెనీ సెక్రెటరీ జ్యోతి జైన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. అంబానీ స్థానంలో పంకజ్ మోహన్ పవార్‌ రిలయన్స్ జియో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్పీకరించారు. రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరీలను కంపెనీ అడిషనల్ డైరెక్టర్‌గా నియమించారు. జూన్ 27 నుంచి ఐదేళ్లపాటు వీరంతా ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. దీనిపై షేర్‌హోల్డర్స్ ఆమోదం పొందాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)