విద్యార్థినులతో వెళ్తోన్న బస్సు బోల్తా - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 June 2022

విద్యార్థినులతో వెళ్తోన్న బస్సు బోల్తా


సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు సమీపంలో ఉన్న రాణిపూల్ వద్ద 22 మంది కాలేజీ విద్యార్థినులతో వెళ్తోన్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, విద్యార్థినులందరికీ గాయాలయ్యాయి. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని సేయింట్ జేవియర్స్ అనే కాలేజీకి చెందిన ఈ విద్యార్థినులు విహార యాత్ర నిమిత్తం సిక్కిం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలోకి రాణాపూల్‌లో ఉన్న 7వ మైల్ వద్ద బస్సు ఓవర్‌టర్న్‌ తీసుకుంటుండగా బోల్తా పడింది. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థినులకు సిక్కింలో వైద్యం అందిస్తున్నారు. ఈ విషయమై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించారు. ''రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ పిల్లలతో గ్యాంగ్‌టక్‌కు విద్యా పర్యటనకు వెళ్లిన బస్సు రాణిపూల్ వద్ద ప్రమాదానికి గురైందని ఇప్పుడే తెలిసింది. నేను సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్‌తో మాట్లాడాను. చిన్నారులకు సరైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన నాతో చెప్పారు. అవసరమైతే పిల్లలను విమానం ద్వారా తరలించిన అయినా చికిత్స అందించాలని ఆర్సీకి సూచించాను. అయితే వాతావరణ ప్రతికూలత కారణంగా ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయలేకపోయాం. ప్రస్తుతానికి అయితే సరైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు'' అని సోరెన్ ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment