ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 20 June 2022

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి


మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారి తలపై మొత్తంగా రూ. 30 లక్షల రివార్డు ఉన్నట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మృతి చెందిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు చెప్పారు. బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల్లోని హాక్ ఫోర్స్‌కు, రెబల్స్‌కు మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు మంత్రి పేర్కొన్నారు. మృతి చెందిన మావోలను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్, కమాండర్లు మనోజ్, రామేగా గుర్తించారు. నగేష్ తలపై రూ. 15 లక్షల రివార్డు ఉండగా, మనోజ్, మహిళా కమాండర్ రామేలపై చెరో రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్టు మంత్రి నరోత్తమ్ తెలిపారు.

No comments:

Post a Comment