ఆప్ఘానిస్థాన్ లో ఫ్యాషన్ మోడల్‌ అరెస్ట్

Telugu Lo Computer
0


ఆప్ఘానిస్థాన్ ఫ్యాషన్ మోడల్ అజ్మల్ హకీతోపాటు ఆమె ముగ్గురు సహచరులు ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అగౌరపర్చారని ఆరోపిస్తూ తాలిబన్లు అరెస్ట్ చేశారు. అజ్మల్ హకీ తన ఫ్యాషన్ షోలు, యూట్యూబ్ క్లిప్‌లు, మోడలింగ్ ఈవెంట్‌లతో ప్రసిద్ధి చెందారు. తాలిబాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలలో ఫ్యాషన్ మోడల్ చేతికి సంకెళ్లు వేసి ఉన్నాయి. హకీతోపాటు ఆమె సహ ఉద్యోగి గులాంసఖీ నవ్వుతూ అరబిక్ లో ఖురాన్ పద్యాలు పఠిస్తున్న వివాదాస్పద వీడియో వెలుగు చూసింది. ఫ్యాషన్ మోడల్, ఆమె అనుచరుల అరెస్ట్ తర్వాత వారు లేత గోధుమరంగు జైలు యూనిఫారం ధరించి నిలబడి తాలిబన్ ప్రభుత్వానికి, మత పండితులకు క్షమాపణలు చెబుతున్న వీడియోను తాలిబన్లు విడుదల చేశారు. ఈ వీడియోతోపాటు తాలిబన్లు మరో ట్వీట్ చేశారు. ముహమ్మద్ ప్రవక్తపై, ఖురాన్ పద్యాలు, సూక్తులను ఎవరూ అవమానించడానికి తాము అనుమతించమని తాలిబన్లు ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా అజ్మల్ హకీతోపాటు ఆమె అనుచరులను బేషరతుగా విడుదల చేయాలని తాలిబన్లను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోరింది. అజ్మల్ హకీని అరెస్టును అమ్నెస్టీ దక్షిణాసియా ప్రచారకర్త సమీరా హమీది ఖండించారు.భావవ్యక్తీకరణపై తాలిబన్ల కఠోరదాడి అంటూ సమీరా పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)