హాస్పిటల్‌ కు వచ్చిన మహిళలకు మత్తు మందు ఇచ్చి చోరీ చేస్తాడు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప శ్రీరామ్ నగర్‌కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో జిల్లా సర్వజన వైద్యశాలలో ఎం.ఎన్.ఓ.గా పనిచేశాడు. దాంతో ఆ అనుభవాన్ని ఉపయోగించుకున్న మణిదీప్ ఆస్పత్రిలో రోగులను దోచుకోవడం మొదలుపెట్టాడు.ఏ సమయంలో ఎవరు విధుల్లో ఉంటారు, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలిసిన అతను చాకచక్యంగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. బ్రహ్మంగారి మఠం మండలం పూల చెన్నుపల్లి గ్రామానికి చెందిన ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘరానా మోసగాడి గుట్టు రట్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయని, దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.10 లక్షల విలువైన 22 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, రూ.2,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)