రెబల్ ఎమ్మెల్యేలకు 'వై ప్లస్' భద్రత

Telugu Lo Computer
0


మహారాష్ట్ర మంత్రి, శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే అసోంలోని గువాహటిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిలోని రమేశ్ బోర్నారే, మంగేశ్ కుదాల్కర్‌, సంజయ్ శిర్సత్‌, లతాబాయి సోనావాలె, ప్రకాశ్ సుర్వే సహా 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ సిబ్బందితో ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత కల్పించింది. అంతేకాదు, మహారాష్ట్రలో నివసిస్తోన్న వారి కుటుంబాలకు కూడా కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. వారి ఇళ్ళవద్ద భద్రతా సిబ్బంది ఉంటారు. కొందరి వల్ల వారికి ముప్పు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే లక్ష్యంగా తన వర్గం ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే శిబిరాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన మద్దతుదారులు నిరసన తెలుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)