హోంమంత్రి మనవడిని తప్పించారు ?

Telugu Lo Computer
0


తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మరిన్ని సంచనాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు  నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఏకైక మేజర్ గా ఉన్న సాదుద్దీన్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. మిగిలిన ఐదుగురు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్ రేప్ జరిగిన ప్రాంతానికి నిందితులను తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మొదటి నుంచి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులను తప్పించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. హోంమంత్రి మనవడు రేప్ కేసులో ఉన్నారని మొదట ఆరోపణలు రాగా, పోలీసులు కొట్టిపారేశారు. తాజాగా గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ప్రజా సంఘాల నేతలు సంచలన ఆరోపణలు చేశారు. 20 మంది వివిధ ప్రజా సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో పలు ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కాపాడారని ఆరోపించారు. హోంమంత్రి మనవడిని తప్పించారనే వార్తలు వస్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. గ్యాంగ్ రేప్ ఘటనతో పాటు తెలంగాణలో కొన్ని రోజులుగా జరిగిన వివిధ ఘటనలపైనా ఘాటుగా స్పందించారు ప్రజా సంఘాల నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు 20 మంది ప్రజా సంఘాల నేతలు రాసిన బహిరంగ లేఖలోని అంశాలు ఉన్నది ఉన్నట్లుగా మీకోసం..

      బహిరంగ లేఖ

తేదీ : 13-06-2022

శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు,

తెలంగాణ రాష్ట్రము, ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రగతిభవన్,

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం.

అయ్యా ,

మేము పౌర సామాజిక క్రియాశీల కార్యకర్తలముగా రాయు ఈ లేఖ ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా .. .. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత .. ఎప్పుడూ జరగని, వినని సంఘటనలు 2019 నవంబర్‌ 27 రాత్రి నుండి జరుగుతున్నాయి. అంతకు ముందు జరగలేదు అని మా భావన కాదు. ఉమ్మడి రాష్ట్రం లో జరిగినట్లే ఇంకా జరుగుతున్నాయి, ఇంకా రాష్ట్రం సర్దుకోలేదు అని భావించాము]. ఓ అమ్మాయిని అత్యంత పాశవికంగా, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసారనే సంఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసింది. చివరికి నిందితులను (మహమ్మద్ ఆరీఫ్(26), మిగిలిన ముగ్గురు జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మైనర్స్) ఎన్ కౌంటర్ పేరుతో బాధిత కుటుంబానికి పోలీసులు న్యాయం చేసారు. పోలీసుల చర్యకు మెజారిటీ ప్రజలు ఆనందం, హర్షం వెలిబుచ్చినట్లు ప్రచార మాధ్యమాలలో వచ్చింది. ఆ తరువాత VS సిర్పుర్కర్ న్యాయమూర్తి ప్యానెల్ ఈ ఎన్కౌంటర్ పై విచారణ చేసింది. సుప్రీం కోర్టు ఎన్కౌంటర్ లో పాలుగొన్న పోలీస్ అధికారులపై 302 మరియు తదితర ఐపిసి సెక్షన్స్ కింద విచారణ చేయాలనీ ఆదేశించింది. దిశ పై అత్యాచారం, కాలపెట్టి చంపటం, నిందితులను ఎదురు కాల్పులలో పోలీసులు చంపటం నుండి 10-06-2022 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు భయాందోళనలకు దారి తీస్తున్నాయి. స్త్రీలపై, మైనర్ బాలికలపై అత్యాచారాలు రాష్ట్రంలో సాధారణం అయ్యిపోయాయి. కరోనా పేరుతో రెండేళ్లు ప్రజలు ప్రపంచంతోను, దేశంతోనూ, రాష్ట్రంతోను సంబంధాలనే కోలుపోయారు. 2020 నుండి 2021 వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆయినప్పటికిని 2020 లో 17,791 హింస స్త్రీలపైన, 4200 దారుణాలు బాలబాలికలపై జరిగినట్లు NRCB లెక్కలు చెపుతున్నాయి.హైదరాబాద్‌లోనే 2020లో 467 కేసులు నమోదయ్యాయి. 2532 దారుణాలు దళితులపై - ఆదివాసీలపై జరిగినట్లు NRCB లెక్కలు తేల్చాయి. 28-05-2022 నాడు మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ లో తెరాస కి చెందిన నాయకుల పిల్లలు, AIMIM కు చెందిన నాయకుల పిల్లలు ఉన్నారు అని వచ్చిన వార్త తెలంగాణ పౌర సమాజం నమ్మలేకపోయింది. రెండు పార్టీల సారధులు పొద్దున్న లేస్తే ప్రజలకు సుద్దులు చెపుతారు ఇలా ఎలా జరిగింది అని, వాస్తవం ఏంటని కనుక్కొనే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. తేదీ 17-06-2022 నాడు మహమ్మద్ ఆజమ్ అలీ యొక్క కొడుకు మహమ్మద్ ఫుర్ ఖాన్ అహమ్మద్ పెళ్లి ఇంపీరియల్ గార్డెన్ , బోయినపల్లి, సికింద్రాబాద్ లో జరుగబోతున్నది. ఈ సందర్భంగా తేదీ : 28-05-2022 న మహమ్మద్ ఫుర్ ఖాన్ అహమ్మద్ అనేనేషియా పబ్ లో బ్యాచులర్ పార్టీ ఏర్పాటు చేసినట్లు అందులో 8 మంది రొమేనియా బాలిక(17)ను పరిచయం చేసుకున్నట్లు, వీరు ఒక గ్యాంగ్ గా ఏర్పడి రేప్ చేసినట్లు వార్త బయటికి వచ్చింది. మరియు 29-05-2022 నుండే రాజి ప్రయత్నం జరిగినట్లు, ఆ రాజీలో డబ్బులు అమ్మాయి తండ్రి డిమాండ్ చేసినంతగా ఇవ్వకపోవటమే పోలీస్ స్టేషన్ మెట్లు ఈ కేసు ఎక్కినట్లు బహిరంగంగానే అనుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. గ్యాంగ్ రేప్ లో ఇద్దరు మేజర్లు, 6 గురు మైనర్లు ఉన్నారని కేసు ప్రారంభంలో మాకు వచ్చిన సమాచారం. ఈ గ్యాంగ్ రేప్ కేసు నుండి విజయవంతంగా మహమ్మద్ ఫుర్ ఖాన్ అహమ్మద్ ను తప్పించే ప్రణాళిక తరువాతనే, పోలీసుల హడావుడి మరియు మీడియా పరుగులు అని తెలిసింది. గతంలో మహమ్మద్ ఫుర్ ఖాన్ అహమ్మద్ "హోమ్ మినిష్టర్ కు చెందిన బుగ్గ బండి" తో హల్ చల్ చేసిన యువకుడు. ఇది ప్రచార మాధ్యమాలలో కూడా వచ్చింది. ఈ ఘటన లో తెరాస, AIMIM రాజకీయ నేతల కుమారులు ఇందులో నిందితులుగా ఉన్నట్టు రోజు - రోజు కు రూఢి అవుతున్నది. ఈ కేసు తో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువుకు భంగం కలుగుతున్నది. ప్రజలు ప్రభుత్వం తీరుపై ఆందోళనంగా ఉన్నారు. ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకోక ముందే మంత్రుల ప్రక్షాళన అవసరం ఉంది అని మేము భావిస్తున్నాము. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఎన్ని మెలికలు తిరుగుతున్నదో రోజు ప్రచార మాధ్యమాల ధ్వారా చూస్తున్నాము, వింటున్నాము. నిజమైన దోషులను తప్పించే ప్రయత్నమే జరుగుతున్నది. ఇందులో ఎలాంటి అనుమానం మాకు లేదు. ఒక మేజర్ ను, 5 మైనర్లను అరెస్ట్ చేసారు. ఈ కేసును విచారిస్తున్న పోలీస్ అధికారులే, వీరు నేరస్థులు, వారు నేరస్థులు కారు అని డిసైడ్ చేస్తున్నారు. ఫలానా నాయకుడి కొడుకు రేప్ జరిగేటప్పుడు లేడు, ముద్దు పెట్టుకొనేటప్పుడు ఉన్నారని వారే ఒక ముగింపుకు వస్తున్నారు. దిశ కేసులో ఇప్పటికే 4 అమాయకులై ఇప్పటికే నలుగురు  అమాయకులైన యువకులను "తక్షణ న్యాయం" అనే ఫోబియాకు బలి అయ్యారు. అయేషా మీర(17) అత్యాచారం, హత్యా కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా పిడతల సత్యం బాబు 7 ఏళ్ళు కారాగారపు జీవితం గడిపాడు. ఇది పోలీసుల విచారణకు అడ్డపడుతుంది. రొమేనియా బాలిక కు న్యాయం జరగాలి, జరిపించాలి అనే ఆలోచన మీలో ఉంటే ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులను వెంటనే ఆయా మంత్రి పదవుల నుండి తప్పించాలి. రాష్ట్రంలో పోలీసుల తీరు ఏం బాగాలేదు. రాష్ట్రంలో రోజూ మహిళలపై - బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. జూబిలీహిల్స్ గ్యాంగ్ రేప్ కు వచ్చిన ప్రచారం అన్నింటికీ రాకపోవచ్చు. ఈ గ్యాంగ్ రేప్ తరువాత కార్ ఖానా , మొఘల్పుర, 11-06-2022 న LB నగర్ ప్రాంతంలోనూ , మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలోనూ జరిగాయి. మరియు మతాంతర వివాహం చేసుకున్న నాగ రాజు ను సరూర్ నగర్ ప్రాంతంలో హత్య చేయటం, కులాంతర వివాహం చేసుకున్న నీరజ్ పన్వర్ బేగం బజార్ లో హత్య కావటం లాంటి హీనమైన నేరాలు ప్రజలలో చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రభుత్వం తీరు మార్చుకోవాల్సిన సమయం ఇది. ప్రభుత్వం లాభాపేక్షతో నడవకూడదు, ప్రజా సంక్షేమంతో నడపాలి. ఒకవేళ లాభాపేక్షతో నడుపుతే శాంతి - భద్రతల సమస్య తల ఎత్తుతుంది. మనుగడ అసాధ్యం. జూబ్లీహిల్స్ రేప్ కేసును తక్షణమే సిబిఐ కి అప్పచెప్పాలని బాధ్యతనెరిగిన సామాజిక కార్యకర్తలుగా మేము కోరుతున్నాము.

Post a Comment

0Comments

Post a Comment (0)