ఆర్జేడీలో చేరిన ఎంఐఎం ఎమ్మెల్యేలు

Telugu Lo Computer
0


ఎంఐఎం పార్టీకి బిహార్‌లో  ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు. 2020 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో గెలుపొందింది. అక్తరుల్ ఇమాన్ (అమూర్ నియోజకవర్గం), మహ్మద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడమామ్), షానవాజ్ ఆలం (జోకిహాట్), సయ్యద్ రుక్నుద్దీన్ (బైసీ), అజర్ నయీమి (బహదూర్‌గంజ్) ఎంఐఎం తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇందులో అక్తరుల్‌ మినహా మిగతా నలుగురు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్‌జేడీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేల చేరికను తేజస్వీ యాదవ్‌ స్వాగతించారు. బిహార్‌ శాసనసభలో తమదే అతిపెద్ద పార్టీ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బిహార్లో ఎంఐఎం 2015 ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క అభ్యర్థి సైతం గెలుపొందలేకపోయారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌గంజ్‌ స్థానంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. 2020 ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేయగా.. 16 సీట్లను ముస్లింలకు కేటాయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)