గంజాయి మత్తులో యువకుడి వికృతి చేష్టలు !

Telugu Lo Computer
0



అసోంలోని సోనిత్ పూర్ జిల్లాలోని దేకర్ గ్రామంలో సహోజల్ ఆలీ అలియాస్ ఆలీ అనే యువకుడు 22 ఏళ్లు వచ్చే వరకు సాటి స్నేహితులతో కలిసి మెలిసి జీవించాడు. ఇస్లాం ధర్మం కచ్చితంగా పాటించే ఆలీలో రెండు సంవత్సరాల నుంచి తేడాలు వచ్చాయి. రాను రాను ఒంటరిగా బయటకు వెళ్లి వస్తున్న ఆలీ గంజాయి చేవించడానికి బానిస అయ్యాడు. గంజాయితో పాటు డ్రగ్స్ కు బానిస అయిన ఆలీ అతని స్నేహితులను దూరంగా పెట్టాడు. గంజాయి తీసుకుని ఊరిబయటకు వెళ్లిపోయి ఒంటరిగా కుర్చుని గంజాయి సేవిస్తూ మత్తులో ఊగుతూ  కుటుంబ సభ్యులు, స్నేహితులను మరిచిపోయి ఎంజాయ్ చేశాడు. గంజాయి మత్తులో ఆలీ కత్తులు, బ్లేడ్ లు తీసుకుని అతని శరీరం మీద గాయాలు చేసుకుని శాడిస్టు లాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కొంతకాలం నుంచి ఆలీ వేదాంతం మాట్లాడటం మొదలు పెట్టాడని తెలిసింది. ఇస్లాం ధర్మం ప్రకారం గంజాయి, మద్యం, డ్రగ్స్ సేవించడం నేరమని, అయితే తాను గంజాయి, డ్రగ్స్ సేవించి చాలా తప్పు చేశానని కొంతకాలంగా కొందరు స్నేహితుల దగ్గర ఆలీ విచారం వ్యక్తం చేశాడని తెలిసింది. మే 19వ తేదీన ఆలీ విపరీతంగా గంజాయి సేవించాడు. ఇంట్లోని ఓ గాదిలోకి వెళ్లిన ఆలీ పదునైన కత్తి తీసుకుని అతని మర్మాంగం పూర్తిగా కోసేసి విసిరేశాడు. నొప్పి తట్టుకోలేక ఆలీ కేకలు వేశాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆలీని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తాను గంజాయి సేవించి తప్పు చేశానని, తనకు తానే శిక్ష విధించుకోవాలని మర్మాంగం కత్తిరించుకున్నానని ఆలీ చెప్పడం హాట్ టాపిక్ మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)