నేను బతికే ఉన్నా!

Telugu Lo Computer
0


లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి దేశాన్ని వదిలివెళ్లి ఈక్వెడార్‌కు సమీపంలోని 'కైలాస' అనే దీవిని ఏర్పాటు చేసుకొని అప్పట్లో సంచలనం సృష్టించారు. కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడమే కాక ప్రధానిగా నేనే అంటూ ప్రకటించుకున్నారు. కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఏకంగా ఐక్యరాజ్య సమితికి నిత్యానంద అభ్యర్థన కూడా చేసుకున్నారు. కొద్ది రోజులకే కైలాస డాలర్ ను తీసుకొచ్చి, తర్వాత రిజర్వ్ బ్యాంకు ఆప్ కైలాసను కూడా ప్రారంభించినట్లు అప్పట్లో ప్రకటించారు. అయితే గత కొద్దిరోజులుగా నిత్యానంద చనిపోయారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆయన అనారోగ్యం కారణంగా మరణించారని వార్తలొచ్చాయి. తాజాగా నిత్యానంద ఈ వార్తలపై స్పందించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా నేను చనిపోలేదు, బతికే ఉన్నా అంటూ పోస్ట్ చేశారు. తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని తెలిపారు. నేను మరణించినట్లు కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు, నేను సమాధిలోకి వెళ్లాను అంటూ ఫేస్ బుక్ పోస్టు ద్వారా తెలిపారు. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నానని, అందుకు కాస్త సమయం పడుతుందని అన్నారు. తనకు 27 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారని, మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేక పోతున్నానని త్వరలో కోలుకుంటానని, మీముందుకొచ్చి మాట్లాడతానని నిత్యానంద తెలిపారు. అయితే నిత్యానంద ఏ ప్రాంతంలో ఉన్నారనే స్పష్టత లేదు. ఈక్వెడార్ కు సమీపంలోని ఓ ద్వీపంలో నిత్యానంద నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి, కానీ ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. నిత్యానంద భారత్ లో ఉన్న సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం ద్వారా 50సార్లు కోర్టుకు హాజరయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)