తుంగభద్రకు పెరుగుతున్నవరద

Telugu Lo Computer
0


కర్ణాటక లోని తుంగభద్ర జలాశయం నిండుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9,342 క్యూసెక్కులుగా వుంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1593 అడుగులుగా వుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100. 855 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 12.54 టీఎంసీలుగా వుంది. ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గతేడాది కంటే ముందుగానే డ్యామ్ నిండే అవకాశం వుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సాధారణంగా వర్షాలు బాగా పడినప్పుడు మాత్రమే వరద ప్రవాహం పెరుగుతుంది. ఏటా జూన్, జూలై మాసాల్లో రుతుపవనాల వల్ల వర్షాలు బాగా పడతాయి. అప్పుడు ప్రాజెక్టుకి వచ్చే ఇన్ ఫ్లో పెరుగుతూ వుంటుంది. అయితే, ఈసారి చాలాముందుగానే ప్రాజెక్టుకి వరద ప్రవాహం రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ రుతుపవనాల రాక కూడా ప్రారంభం కావడంతో గత ఏడాది కంటే ఈసారి ఇన్ ఫ్లో మరింతగా పెరుగుతుందని అంటున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)