ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన !

Telugu Lo Computer
0


టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేటీఆర్ పర్యటన షెడ్యూల్ చూస్తే ఈరోజు ఉదయం 9 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ నుండి బయలుదేరి హెలికాప్టర్లో వరంగల్ జిల్లాకు చేరుకుంటారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో కిటెక్క్ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు కేటీఆర్. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు, పలు పరిశ్రమలను ప్రారంభించనున్నారు. 10 గంటల 30 నిమిషాలకు పరకాలలో పార్టీ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. 11 గంటల 30 నిమిషాలకు తిరిగి శాయంపేట హవేలి నుండి బయలుదేరి 12 గంటలకు మామునూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మామునూర్ ఎయిర్ పోర్ట్ ను మంత్రి కేటీఆర్ సందర్శిస్తారు. తర్వాత హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసానికి చేరుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. ఆపై హనుమకొండ నయీం నగర్ లోని చైతన్య డిగ్రీ కళాశాల లోని సాఫ్ట్ పాత్ సిస్టం ఐటి ఆఫీస్ ను ప్రారంభిస్తారు. కంపెనీ మొదటి వార్షికోత్సవం లో కూడా మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ ఈరోజు వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన శుక్రవారం కొనసాగింది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో జరిగిన రాహుల్ గాంధీ సభ లో రైతు డిక్లరేషన్ ప్రకటించటంతో పాటుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు వరంగల్లోనే మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది . ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. .

Post a Comment

0Comments

Post a Comment (0)