మూడు క్షిపణుల ప్రయోగం ఉత్తర కొరియా

Telugu Lo Computer
0


ఈ రోజు తెల్లవారుజామున వరసగా ఉత్తర కొరియా మూడు క్షిపణులను ప్రయోగించింది.  ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో జపాన్, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మూడు క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించింది. ఈ విషయాన్ని సియోల్ మిలటరీ ధ్రువీకరించింది. సునమ్ ప్రాంతం నుంచి మూడు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం కూడా ఆ దేశ కోస్ట్ గార్డ్ ను సముద్రంలో పడే వస్తువులకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.  నీటిలో పడిపోయిన వస్తువులకు కోస్ట్ గార్డ్ నౌకలు దూరంగా వెళ్లాలని ఆదేశించింది. జపాన్ ప్రధాని కిషిడా కూడా నార్త్ కొరియా ప్రయోగంపై స్పందించారు. ఈ ప్రయోగాన్ని జపాన్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు.నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం నేపథ్యంలో దక్షిణ కొరియా హై అలెర్ట్ ప్రకటించింది. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసరంగా జాతీయ భద్రత మండలిలో సమావేశం అయ్యారు. అమెరికా అధ్యక్షుడు క్వాడ్ మీటింగ్ కోసం జపాన్ వెళ్లి, తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ ప్రయోగాలను నార్త్ కొరియా చేపట్టింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)