ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి

Telugu Lo Computer
0


ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది మరణించారు. పన్నెండు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగంతస్తుల బిల్డింగులో ముందుగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మిగతా అంతస్తులకూ వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు, మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. యాభై మందికిపైగా రక్షించారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ సజావుగా సాగలేదు. క్రేన్లు, నిచ్చెనలు వినియోగించి సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఘటనలో మృతుల శరీరాలు గుర్తుపట్టలేకుండా కాలిపోయాయి. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనకు బాధ్యులైన బిల్డింగ్ యజమానులపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. యజమానులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)