13 అడుగుల కోడెత్రాచు పట్టివేత

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలంలోని ఘాట్‌రోడ్డు సమీపంలో సైదారావు అనే రైతుకు చెందిన పామాయిల్‌ తోటలోకి ఆదివారం 13 అడుగుల భారీ కోడెత్రాచు (కింగ్‌కోబ్రా) ప్రవేశించింది. ఈ సమయంలో పామాయిల్‌ గెలలు కోస్తున్న కూలీలు దీనిని గమనించి వెంటనే తోట యజమానికి చెప్పారు. ఆయన ఈస్ట్రన్‌ ఘాట్స్‌ వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ సభ్యుడైన స్నేక్‌ క్యాచర్‌ వెంకటేశ్‌కి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. కొద్దిసేపట్లో తోట వద్దకు చేరుకున్న వెంకటేశ్‌ చాకచక్యంగా కింగ్‌కోబ్రాని పట్టుకున్నారు. అనంతరం గోనె సంచిలో పెట్టి వంట్లమామిడి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)