తాతినేని రామారావు కన్నుమూత

Telugu Lo Computer
0


ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ కళాశాల అసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తాతినేని రామారావు 70కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నవరాత్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి చిత్రాలకు తాతానేని దర్శకుడిగా పనిచేసి అందరి మన్ననలను పొందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)