బోరుమని ఏడ్చిన వరుడు !

Telugu Lo Computer
0



భావోద్వేగాలు ఎవరికైనా సమానంగా ఉంటాయి. దానికి ఆడ, మగ అనే తేడా ఉండదు. అయితే సమాజంలో ఆడవారి ఎమోషన్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత మగవారికి ఇవ్వరు. అంతటితో ఆగకుండా 'ఏడిచే మగాడిని నమ్మకూడదు' అని నానుడి కూడా ఉంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తుంటే మగవారు కూడా ఎమోషన్స్‌కు అతీతులేం కాదని చెప్పకనే చెబుతోంది. ఓ జంట పెళ్లి బంధంతో ఒకటవుతోంది. ఈ తరుణంలో వధువుకి మంగళ సూత్రం కట్టే సమయంలో పెళ్లి కొడుకు ఒక్కసారిగా ఎమోషన్‌కు గురయ్యాడు. చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. దీంతో ఇది చూసిన పెళ్లి కూతురు మొదట్లో కంగారు పడుతూ తాను భావోద్వేగానికి గురైనా, కాబోయే వాడు తనను ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమై ముసి ముసి నవ్వులు నవ్వేసింది. అనంతరం వరుడు, పెళ్లి కూతురు బుగ్గపై ఓ ముద్దివ్వగానే సిగ్గుల మొగ్గైందా నవ వధువు. ఇదంతా వెడ్డింగ్‌ షూటింగ్‌ కెమెరాల్లో రికార్డ్‌ అయిపోయింది. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. వరుడు ఏడ్చినా బాగుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)