కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారు సేఫ్ ?

Telugu Lo Computer
0


చైనాలో కొత్తరకం వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. భారత్ లో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటికీ ముంబైలో ఎక్స్ ఈ వేరియంట్ కేసు నమోదయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మళ్లీ దేశ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూబ్ ఆఫ్ వైరాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రగ్యా యాదవ్ నేతృత్వం వహించిన పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కొవాగ్జిన్ రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ కు గురైన వారిలో రోగ నిరోధక ప్రతి స్పందనలు అత్యంత అధిక స్థాయిలో ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంతేకాక ఆందోళనకర వేరియంట్లయిన బీటా, డెల్టా, ఒమిక్రాన్ లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్ టీకా దోహదపడుతున్నట్లు ఈ పరిశోధనలతో స్పష్టమైంది. ఒమిక్రాన్ కారణంగా కొవాగ్జిన్ టీకా ఏ విధంగా పనిచేస్తుంది, ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందన్న విషయంపై వివిధ రకాల వయస్సుల వారిపై పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో థర్డ్ వేవ్ తరువాత సగటున రెండో డోసు తీసుకున్న 43 రోజుల తర్వాత బ్రేక్ త్రూ కేసులు నమోదైనట్లు లెక్కించారు. ఇలాంటి 95శాతం కేసుల్లో లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, కొందరిలో అసలు లక్షణాలే ఉండటం లేదని గుర్తించారు. కొవిడ్ గురైన తర్వాత కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ రోగ నిరోధక శక్తి అధిక స్థాయిలో ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)