షూటింగ్ కోసం కట్టిన ఇళ్లు పేదలకు ఇచ్చేశాడు !

Telugu Lo Computer
0


బాల దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కన్యాకుమారిలో జరుగుతోంది. షూటింగ్‌ కోసం జాలర్లు నివసించే గుడిసెల తరహాలోనే భారీ ఖర్చుతో ఇళ్లను నిర్మించారు. అయితే అక్కడ ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక వాటిని కూల్చివేయకుండా ఇళ్లు లేని నిరుపేద మత్స్యకారులకు ఇవ్వాలని సూర్య నిర్ణయించారు. ఎంతో శ్రమతో ఖర్చుతో నిర్మించిన ఇళ్లను షూటింగ్ అనంతరం కూల్చివేయకుండా వాటిలో కొన్ని కుటుంబాలకు అయినా నీడ కల్పించాలనే సూర్య అనుకున్నారు. దీంతో సూర్య చేసిన ఈ ఆలోచనను, ఆశయాన్ని ఆయన అభిమానులు, ఆ ప్రాంతంలోని ప్రజలు అభినందిస్తున్నారు. సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ హిట్ అయిన సూర్య సినిమా జైభీమ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమా సమయంలో కూడా సూర్య తన గొప్ప మనసు చాటుకున్నాడు. జై భీమ్ సినిమా తో అందరికీ తెలిసిన రియల్ సినతల్లి అమ్మాళ్ కు సూర్య సాయం చేశాడు. అమ్మాళ్ పేరు హీరో సూర్య రూ. 10 లక్షల ను బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసాడు. అంతే కాకుండా దాని నుంచి వచ్చే నెల వారి వడ్డీని అమ్మాళ్ కు అందేలా సూర్య చూశాడు. అయితే ఈ అమ్మాళ్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా జై భీమ్ అనే సినిమా తెరకెక్కింది. మరోవైపు మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. పేద విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. మోహన్‌లాల్‌ 20 మంది పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. విశ్వశాంతి ఫౌండేషన్‌ సహకారంతో అట్టపాడికి చెందిన గిరిజన బాలలను ఎంపిక చేసి 15 ఏళ్ల పాటు వారిని చదివించనున్నట్లు మోహన్ లాల్ తెలిపారు.దీంతో మోహన్ లాల్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)