ఆడి ఈ-ట్రోన్​ను కొన్న మహేష్ బాబు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 April 2022

ఆడి ఈ-ట్రోన్​ను కొన్న మహేష్ బాబు


టాలీవుడ్ హీరో మహేష్ బాబు కొత్త కారు కొన్నాడు. ఆల్-ఎలక్ట్రిక్ ఆడి ఇ-ట్రాన్ SUV అనే కొత్త కారును మహేష్ కొనుగోలు చేశారు. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఆడి సంస్థకు చెందిన ఈ-ట్రోన్​ను ఆయన కొన్నారు. నిజానికి ఈ కారు గత ఏడాది విడుదలైంది. కొన్నాళ్ల క్రితమే మహేష్ ఈ కారును బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 16న ఈ కారును డెలివరీ ఇచ్చింది సంస్థ. బ్లాక్​ కలర్ ఈ-ట్రోన్​ కార్​ను స్వయంగా ఆడి ఇండియా అధినేత బల్బీర్ సింగ్ దిల్లాన్​ ఆడి ఈ-ట్రోన్​ను మహేశ్​ బాబుకు అందించారు. కారుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కారు ప్రత్యేకత ఏమిటంటే దేశంలో ఆడి కంపెనీ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్. ఆడి ఇ-ట్రాన్ SUV అనేక లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంది. సాఫ్ట్ టచ్ డోర్ క్లోజింగ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, B&O 3D ప్రీమియం సౌండ్ సిస్టమ్, డైనమిక్ లైట్ స్టేజింగ్‌తో కూడిన డిజిటల్ మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, హెడ్-అప్ డిస్‌ప్లేతో సహా పలు సాంకేతికతను కలిగి ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. ఈ కారులో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు సెంటర్ కన్సోల్‌లో డ్యూయల్ టచ్ స్క్రీన్‌లు, అలాగే వర్చువల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ-ట్రోన్‌ కారు బ్యాటరీ సామర్థ్యం 71.2 కిలోవాట్స్‌ బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చింది. ఇది 230 కిలోవాట్స్​ ఔట్​పుట్​ను ఈ కారు విడుదల చేయగలదు. 540 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేసే సామర్థ్యం ఈ కారు సొంతం. ఇక ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 190 కిలోమీటర్లు కాగా.. కేవలం 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం దీని సొంతం.EV 95 kWh బ్యాటరీ ప్యాక్ మరియు డ్యూయల్ మోటార్ సెటప్‌తో కూడా అమర్చబడి ఉంది. 402 bhp, 664 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది, ఇది స్టాండ్ స్టిల్ నుండి అందుబాటులో ఉంటుంది. ఈ SUV కేవలం 5.7 సెకన్లలో 0-100 kmph వేగంతో వెళ్లగలదు. కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 359-484 కిమీ దూరం వెళ్లగలదు. కారు 50 kW ఫాస్ట్ ఛార్జర్‌పై 2 గంటలలోపు 0-80% నుండి ఛార్జ్ చేయబడుతుంది. ఆడి ద్వారా సరఫరా చేయబడిన 11 kW AC ఛార్జర్ 8.5 గంటల్లో 0-80 నుండి కారును ఛార్జ్ చేస్తుంది.ఈ-ట్రోన్‌ ఎక్స్‌షోరూం (ఢిల్లీ) ధరను రూ 1.01 కోట్ల నుంచి 1.19 కోట్లుగా నిర్ణయించింది ఆడి. మహేష్ బాబుకు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డెలివరీ ఇస్తూ తీసుకున్న ఫోటోను ట్వీట్ చేశారు. మహేష్ బాబు కూడా ఆడి కారు ఓనర్ అయ్యాననే విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

No comments:

Post a Comment