చరఖా తిప్పి నూలు వడికిన బ్రిటన్ ప్రధాని

Telugu Lo Computer
0


భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా బోరిస్ గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని ఆశ్రమంలో మహాత్మా గాంధీ వాడిన నూలు చరఖను తిప్పి తిప్పారు. నూలు వడికారు. చరఖా తిప్పి నూలు వడకటంలో బోరిస్ జాన్సన్ కు ఆశ్రమ నిర్వాహకులు సహాయం చేశారు. సబర్మతి ఆశ్రమ సందర్శన సందర్భంగా బోరిస్ జాన్సన్ విజిటర్స్ బుక్‌ పై సంతకం చేశారు. ఓ అసాధారణ వ్యక్తికి చెందిన ఆశ్రమాన్ని విజిట్ చేయడం గౌరవంగా భావిస్తానని, ప్రపంచాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సత్యం, అహింసా సిద్ధాంతాలను గాంధీ ఎలా వాడరన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆ బుక్‌ లో బోరిస్ రాశారు. గాంధీజీ రాసిన గైడ్ టు లండన్ అన్న పుస్తకాన్ని బోరిస్‌ కు గిఫ్ట్‌ గా ఇచ్చారు. బోరిస్‌ జాన్సన్‌ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావటం గమనార్హం.  బ్రిటన్‌లో ఉన్న భారతీయుల్లో అత్యధికులు గుజరాత్‌కు చెందినవారే కావడంతో ఆయన నేరుగా అహ్మద్‌బాద్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈరోజు గుజరాత్ పర్యటనలో బోరిస్ జాన్సన్..గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌ ను నిర్వహించనున్నట్లు సమాచారం. భారత్‌- బ్రిటన్‌ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు.ఆ తరువాత ఆయన ఢిల్లీకి పయనమవుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)