రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ కాదు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 April 2022

రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ కాదు !


'గవర్నర్ గా మీ బాధ్యత సరిగ్గా నెరవేర్చండి. రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం పద్ధతి కాదు' అంటూ గవర్నర్ తమిళిసై మీద రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. 'ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావి. ఎవరో నామినేట్ చేసినవి కాదు. రాజ్యాంగ హోదాలో ఉన్న మీరు.. రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదు' అని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదు అని గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి చెప్పటం సరికాదని ఆయన అన్నారు. మాట్లాడేటప్పుడు హోదాను గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. రాజ్యాంగ పదవిలో ఉండి, గవర్నర్ రాజకీయ పరమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయని పలు సందర్భాల్లో చెప్పారు. గవర్నర్ ఆ విషయం తెలుసుకోని మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  హితవు పలికారు.

No comments:

Post a Comment