కరోనా మరణ ముప్పును ఈసీజీతో గుర్తించవచ్చు !

Telugu Lo Computer
0


సాధారణ ఈసీజీతో  కరోనా మరణ ముప్పును ముందే అంచనా వేయవచ్చని ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సౌరాస్కీ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్త ఏరియల్‌ బనాయ్‌ బృందం తాజా అధ్యయనంలో వెల్లడైంది. తద్వారా ఆ బాధితులకు మెరుగైన వైద్యం అందించే వీలుంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈసీజీలో 'క్యూటీ విరామం' అనేది గుండె గదులు సంకోచించినప్పటి నుంచి విశ్రాంతి తీసుకునే వరకూ మధ్యనున్న సమయాన్ని విద్యుత్‌ సంకేతాల ద్వారా మిల్లీ సెకెండ్లలో కొలిచి చెబుతుంది. అధ్యయనంలో భాగంగా- వివిధ ఆసుపత్రుల్లో చేరిన కొవిడ్‌ బాధితులకు పరిశోధకులు ఈసీజీ తీయించారు. అందులోని క్యూటీ విరామాలు, ఆ రోగుల ఆరోగ్య పరిస్థితుల మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. క్యూటీ విరామం ఎక్కువగా ఉండేవారికి గుండె పోటు, హృదయ వైఫల్యం, క్రమరహిత హృదయ స్పందనలు (అరిథమియాస్‌), గుండె లయకు సంబంధించిన రుగ్మతల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు శాస్త్రీయంగా అంచనాకు వచ్చారు. కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరిన వెంటనే వారికి ఈసీజీ తీయించాలని, అందులోని క్యూటీ విరామాలను పరిశీలించడం ద్వారా వారికి గుండె సంబంధ రుగ్మత, తీవ్ర అనారోగ్య ముప్పు ఉంటుందా? లేదా? అన్నది ముందుగానే గుర్తించవచ్చని బనాయ్‌ సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)