మైనర్ తో ఉపాధ్యాయురాలు జంప్!

Telugu Lo Computer
0


ఒక మైనర్ విద్యార్థితో లేడీ లెక్చరర్ జంప్ అయింది. విద్యార్థి కాలేజీ నుంచి ఇంటికి రాకపోవడంతో విద్యార్థి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఉపాధ్యాయురాలు కూడా కాలేజీ నుంచి రాలేదు. ఉపాధ్యాయురాలు కుటుంబ సభ్యులు కాలేజీకి వెళ్లి విచారించారు. ఆ ఉపాధ్యాయురాలు ఆ రోజు కాలేజీకి రాలేదని తెలిపారు. ఇక పోలీసులు రంగంలోకి విచారణ చేపట్టగా తన కంటే 10 ఏళ్లు చిన్న వయస్సులో ఉన్న కుర్రాడితో ఉపాధ్యాయురాలు జంప్ అయిందని తెలిసింది. ఇద్దరి ఫోన్లు ఒకే సారి స్విచ్ ఆఫ్ కావడంతో పాటు కుర్రాడి కాల్ రికార్డ్స్ ఆధారంగా అసలు నిజం తెలిసింది. కొద్ది రోజుల తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. విద్యార్ధిని జువైనల్ హోంకి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)