రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స ?

Telugu Lo Computer
0


కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం  పార్లమెంట్ లో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి నగదు రహిత చికిత్స అందించనున్నామని దీన్ని మొదటగా స్వర్ణ చతుర్భుజి మార్గాల్లో దీన్ని ప్రవేశ పెట్టి క్రమంగా అన్ని జాతీయ రహదారులకూ విస్తరింపజేయాలన్న ఆలోచనలో ఉన్నామని లోక్ సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రమాదాలకు గురైన వారికి నగదు తీసుకోకుండా వైద్యం అందించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈక్రమంలో ఎంపిక చేసిన బీమా కంపెనీ బిడ్డింగ్ ప్రక్రియ ముగిసి, ఆన్‌బోర్డింగ్ చేసిన తర్వాతే పథకం విజయాన్ని అంచనా వేయవచ్చని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభకు సమాధానం ఇచ్చారు. స్వర్ణ చతుర్భుజిలో భాగమైన ఢిల్లీ-ముంబై, ముంబయి- చెన్నై, చెన్నై-కోల్‌కతా, కోల్‌కతా- ఆగ్రా, ఆగ్రా-ఢిల్లీ కారిడార్‌లోని జాతీయ రహదారులపై పైలట్‌ ప్రాజెక్ట్‌గా క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఆయా రహదారులపై డ్రైవర్లు, ప్రయాణికులు, పాదచారులు ఎవరైనా ప్రమాదంలో గాయపడితే ఈ స్కీమ్‌ కింద ఉచిత వైద్యం అందించనున్నారు. ప్రమాద స్థలికి అంబులెన్స్‌ చేరినప్పటి నుంచి 48 గంటల వరకు ఈ స్కీమ్‌ వర్తిస్తుందని, రూ.30వేల వరకు ఖర్చును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భరించనుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించామని గడ్కరీ తెలిపారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే అన్ని జాతీయ రహదారులకు విస్తరింపజేయాలని యోచిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 710 అంబులెన్సులు వివిధ టోల్‌ప్లాజాల వద్ద అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)