యువతి దారుణ హత్య !

Telugu Lo Computer
0


ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వనిష్క బన్సాల్ అనే అమ్మాయి కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఆమె గురువారం సాయంత్రం హాస్టల్‌ సమీపంలోని ఓ షాప్‌కు తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది. ఆమె క్లాస్‌మేట్‌ అయిన ఆదిత్య తోమర్ అక్కడి​కి బైక్‌పై వచ్చి ఆమెను తన బైక్‌పై ఎక్కించుకువెళ్లాలని ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తనతోపాటు తెచ్చిన గన్‌ తో  ఆమెను షూట్‌ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. వనిష్క అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ఆదిత్య తోమర్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. గత కొన్ని రోజులు కింద వనిష్క సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్ట్‌పై ఆమె క్లాస్‌మేట్‌ అయిన ఆదిత్మ కామెంట్‌ చేశాడు. దీంతో ఆమె తన స్నేహితులకు అతనిపై ఫిర్యాదు చేసింది. వనిష్క​ స్నేహితులు ఆదిత్యను పట్టుకొని ఆమె కాళ్లు మొక్కించి క్షమాపణ చెప్పించారు. దీంతో స్నేహితుల మధ్య జరిగిన అవమానం తట్టుకోలేని ఆదిత్య వనిష్కపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని భావించి ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)