కేంద్ర సాయుధ బలగాలకు ఏడాదికి వంద రోజుల సెలవులు!

Telugu Lo Computer
0


కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన జవాన్ల కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు తమ కుటుంబంతో గడిపేందుకు జవాన్లకు అనుమతించాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదన త్వరలో అమల్లోకి రానున్నది. ఈ సెలవులకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు అ ధికారులు వెల్లడించారు. ఈ పాలసీ అమలులో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే హోం శాఖ పలుమార్లు చర్చలు జరిపింది. జవాన్లపై పని ఒత్తిడి తగ్గించడం, అత్యంత సవాలుగా ఉన్న పలు ప్రాంతాల్లో కష్టతరమైన విధులను నిర్వహించే సుమారు 10 లక్షల మంది సైనికుల జీవితాల్లో ఆనందాన్ని నింపడం ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. వంద రోజుల సెలవులను ఎలా అమలు చేయాలనే దానిపై హోం మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని సీఏపీఎఫ్‌ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విధానాన్ని ఎప్పుడో అమల్లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా సమస్యలు తలెత్తినట్లు ఆయన వెల్లడించారు. జవాన్ల 100 రోజుల సెలవుల సమయంలో విధులకు ఆటంకం కలగకుండా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం, మహమ్మారి సంక్రమణను అరికట్టడం పైనా కేంద్రం దృష్టిసారించినట్లు ఆ అధికారి వివరించారు. 100 రోజుల సెలవులకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయని, అమిత్‌ షాతోపాటు సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ సైతం ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం జవాన్లకు సంవత్సరంలో 60-65 రోజుల వరకు సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఈ సెలవుల విధానం అమలైతే కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీతో పాాటు అస్సాం రైఫిల్స్‌, ఎన్‌ఎస్‌జీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్న వారు సైతం లబ్ధి పొందే అవకాశం ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)