చిత్తూరు జిల్లాలో కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు

Telugu Lo Computer
0


చిత్తూరు జిల్లాలో కొత్తగా శ్రీకాళహస్తి, నగరి, కుప్పం రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది జనవరి 26న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌లో కేవలం పలమనేరు రెవెన్యూ డివిజన్‌నే నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కేబినెట్‌ నోట్‌లో బుధవారం ఉంచిన మూడు డివిజన్లను కలుపుకొంటే కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో కొత్తగా వచ్చే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఎనిమిది రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. తిరుపతి కేంద్రంగా 'శ్రీ బాలాజీ' పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మొదట ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 'తిరుపతి' జిల్లాగా పేరు మార్చారు. కేబినెట్‌ నోట్‌ ప్రకారమే తుది నోటిఫికేషన్‌ విడుదలై జిల్లాల విభజన జరిగితే అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉందని ప్రజానీకం అభిప్రాయపడుతోంది. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌గా పేర్కొన్నందున కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన భవనాలను స్థానిక తహసీల్దారు జరీనాబేగం పరిశీలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)