సమతా మూర్తి సందర్శనకు నాలుగు రోజుల పాటు అనుమతి రద్దు!

Telugu Lo Computer
0


ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఉన్న సమతామూర్తి విగ్రహానికి నాలుగు రోజుల పాటు భక్తుల సందర్శనకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సమతామూర్తిని దర్శించుకోవాలంటే టికెట్లు తప్పనిసరి కొనుగోలు చేయాలనే నిబంధన విధించారు. దీంతో భక్తులకు పెడుతున్న కండిషన్లతో దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. దర్శనానికి వచ్చే వారు చెప్పులతో రావొద్దని బూట్లు ఉండకూడదని సూచిస్తున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలు లోనికి తీసుకెళ్లరాదనే నిబంధన కూడా పెట్టారు. సమతామూర్తి విగ్రహావిష్కరణలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామికి మధ్య దూరం పెరిగింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు కేసీఆర్ హాజరు కాకపోవడంతో శిలాఫలకంపై ఆయన పేరు వేయలేదు. దీంతో అలకబూనిన కేసీఆర్ ఇప్పటి వరకు జీయర్ స్వామి గడప తొక్కలేదు. యాదాద్రి ఆలయ పున: ప్రారంభానికి ఆయనను పిలువలేదు. దీంతో ఇద్దరి మధ్య అగాధం పెరిగింది. శ్రీరామనగరంలో నాలుగు రోజుల పాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులకు దర్శనాలు ఉండవని తెలిపింది. ఉగాది తరువాత భక్తులకు యథావిధి సందర్శనాలు ఉంటాయి. భక్తులు సెల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా లోనికి తీసుకురావద్దని చెబుతున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. యాదాద్రి ఆలయ ప్రారంభానికి జీయర్ స్వామిని రాకుండా చేశారు. ఆలయానికి పేరు పెట్టింది దగ్గర నుంచి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్న జీయర్ స్వామి ఆలయ ప్రారంభానికి మాత్రం రాకుండా చేసి కేసీఆర్ తన పంతం నెగ్గించుకున్నారనే వాదన వినిపిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)