ప్రొఫెసర్ పై ఎఫ్ఐఆర్ నమోదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 March 2022

ప్రొఫెసర్ పై ఎఫ్ఐఆర్ నమోదు


తమిళనాడు లోని కన్యాకుమారిలో వాసుదేవన్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్ధినులకు అభ్యంతరకర అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. 22 ఏళ్ల విద్యార్ధిని వాసుదేవన్ పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం వెలుగులోకి వచ్చింది. విద్యార్ధిని ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ప్రొఫెసర్ పై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్ధులు తరగతులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. వాసుదేవన్ ను విధుల నుంచి తొలగించాలని అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వాసుదేవన్‌పై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన మేరకు విద్యార్దినుల నిరసనను విరమింప చేశారు. విద్యార్ధినులను ప్రొఫెసర్ పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేసినా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. వాసుదేవన్ ద్వందార్ధాలతో కూడిన మెసేజ్‌లు, అశ్లీల వీడియోలను తనకు పంపాడని ఓ విద్యార్ధిని తెలిపింది. ఈ విషయం ఆమె తన సోదరుడికి తెలపడంతో అతడు ప్రొఫెసర్‌ను నిలదీశాడు. అధికారులు వాసుదేవన్‌పై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్ధులు నిరసనలకు దిగారు. విద్యార్ధినుల ఫిర్యాదుల మేరకు పోలీసులు వాసుదేవన్‌పై ఐపీసీ సెక్షన్ 294(బి) (అశ్లీల చర్యలు మరియు పాటలు), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష), 506 (ఐ) (నేరమైన బెదిరింపులకు శిక్ష) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలను అసిస్టెంట్ ప్రోఫెసర్ తోసిపుచ్చాడు. విద్యార్ధిని సోదరుడు తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్ధిని సోదరుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 294 (బి) (అశ్లీలత), 324, 506 (ii) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

No comments:

Post a Comment