తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం

Telugu Lo Computer
0


తెలంగాణలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు వచ్చే సంవత్సరం నుంచే ఇంగ్లీష్ విద్యను బోధించనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో చెప్పారు. 2023 -24 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి, 2024 -25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడతామన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయాల మేరకు విద్యాశాఖకు ఆదేశాలిచ్చామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మన ఊరు - మన బడి - మన బస్తీ - మన బడి కార్యక్రమంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ఇంగ్లిష్‌ మీడియాన్ని విప్లవాత్మక మార్పుగా సబితా ఇంద్రారెడ్డి అభివర్ణించారు. తాజా పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం హోదాకు చిహ్నంగా మారిందని, ఈ మీడియంలో చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న భావన సమాజంలో నెలకొందన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు సైతం కడుపు కట్టుకుని తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తున్నారని, అందరి ఆకాంక్ష మేరకు ఇంగ్లీష్ మీడియాన్ని సర్కారు స్కూళ్లల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందుకోసం ద్విభాషా పుస్తకాలను సిద్ధంచేశామని, ఈనెల 14 నుంచి టీచర్లకు శిక్షణనివ్వనున్నామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)