మే 6న తెరుచుకోనున్నకేదార్‌నాథ్ ద్వారాలు

Telugu Lo Computer
0


మే 6న ఉదయం 6.25 గంటలకు తెరవనున్నట్లు ఉత్తరాఖండ్ దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా బద్రీనాథ్ ఆలయాన్నీ మే 8న మిగిలిన రెండు చార్ ధామ్ ఆలయ పుణ్యక్షేత్రాలు, గంగోత్రి మరియు యమునోత్రి ధామ్యాత్రను మే 3న అక్షయ్ తృతీయ రోజున తెరవనున్నారు. మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఓంకారేశ్వర్ ఆలయంలో శాస్త్రోక్తకంగా చేపట్టిన పూజా కార్యక్రమాలను పరమశివుడికి అంకితం చేసిన అర్చకులు.. కేదార్‌నాథ్ ఆలయాన్ని తెరిచేందుకు శుభఘడియలను లెక్కించి ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని గర్వాల్ హిమాలయాల్లోని మందాకిని నది ఒడ్డున ఉన్న “చార్ ధామ్” పవిత్రాలయాలలో కేదార్ నాథ్ ఒకటి. పురాణాల ప్రకారం, ఈ ఆలయం పాండవులచే స్థాపించబడింది. శివుడికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ప్రధానమైనది ఈ కేదార్ ఆలయం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 14 – 16 కిలోమీటర్ల మేర హిమాలయ పర్వతాల్లో కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఏటా చలికాలంలో ఈ ఆలయాన్ని మూసి తిరిగి వేసవి ప్రారంభం అయ్యాక తెరుస్తారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు కేదార్‌నాథ్ ఆలయం తెరిచి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)