చివరి క్షణంలో ఏం కనిపిస్తుంది?

Telugu Lo Computer
0


మనిషి జీవితంలో మరణం అనేది అత్యంత నిగూఢమైనది. అదొక అంతుచిక్కని అంశం. ఎప్పటికైనా చనిపోతామని తెలుసు గానీ అది ఎప్పుడు..? ఎలానో చెప్పలేం.అసలు చనిపోయే వ్యక్తి ఆ సమయంలో ఎలాంటి భావాలను అనుభవిస్తాడనే రహస్యం కూడా వారితోనే సమాధి అవుతుంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు మరణించిన వ్యక్తి బ్రెయిన్ యాక్టివిటీని విజయవంతంగా సంగ్రహించారు. చివరి క్షణాల్లో మన జీవితం మొత్తం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుందని  చనిపోయేటప్పుడు మెదడులో జరిగే కొన్ని చర్యలను కనుగొన్న తాజా అధ్యయనం నివేదించింది. ఎలక్ట్రో ఎన్సెఫాలో గ్రఫీ  డివైస్ ను ఉపయోగించి 87 ఏళ్ల మూర్ఛ రోగి మెదడు ను అధ్యయనం చేశారు. ఇది మూర్ఛ లను గుర్తించి చికిత్స చేస్తుంది. అయితే ఈ రికార్డింగ్స్ టైంలోనే ఆ రోగి గుండెపోటుతో మరణించాడు. ఈ ఊహించని సంఘటనే చనిపోతున్న మానవ మెదడు కార్యాచరణను రికార్డ్ చేసేందుకు శాస్త్రవేత్తలకు వీలు కల్పించింది. ఫ్రాంటి యర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ ప్రచురణ ప్రకారం వ్యక్తి మరణిస్తున్న ప్పుడు రిథమిక్ బ్రెయిన్ వేవ్ నమూనాలు.. జ్ఞాపకశక్తిని తిరిగి పొందడం, కలలు కనడం తోపాటు ధ్యా నం వంటి క్రియ లకు సమానంగా ఉన్నాయని పరిశోధకులు కనుగొ న్నారు. ప్రాథమికంగా మరణానికి ముందు మనిషి జీవితం అంతా ఓ మెరుపు సెకండ్ల వ్యవధిలో రీకలెక్ట్ అవ్వడా న్నే లైఫ్ రీకాల్ గా పిలుస్తారు. మరణానికి చేరుకున్న ప్పుడు, ఆ తర్వాత.. మెదడు చురుకుగా, సమన్వయంతో ఉండవచ్చని ఈ మొత్తం ప్రయాణం ఒక చోట కూర్పుగా ప్రోగ్రాం చేయొచ్చని ఈ ఎస్ కు చెందిన యూని వర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లే పరిశోధకులు గుర్తించారు. దీని ద్వారా మరణానికి ముందు మెదడు యాక్టివిటీ ని అర్థం చేసుకోవడంతోపాటు అవయవదానానికి సంబంధించిన టైమింగ్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకు మరిన్ని పరిశో ధనలు అవసరమని భావిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)