విడాకులు ఈరోజుల్లో కామన్ : సుమంత్

Telugu Lo Computer
0


ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రెటీలు వారి మ్యారేజ్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. కలహాల కాపురంలో ఇబ్బంది పడేకన్నా ఎవరికివారు విడిపోయి జీవించడమే మంచిదనే వారు కూడా ఉన్నారు. అయితే ఎంత కష్టం వచ్చినా సమస్యలను సాల్వ్ చేసుకొని ఆలోచించి ముందుకు వెళదాం అనేవారు మాత్రం చాలా తక్కువగానే ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీలో బ్రేకప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగార్జున మొదటి పెళ్లి అనంతరం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన మేనల్లుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. అనంతరం అక్కినేని వారసుల విషయంలో కూడా అలానే జరిగింది. నాగచైతన్య సమంత నుంచి విడిపోగా అఖిల్ ఎంగేజ్మెంట్ తరువాత బ్రేకప్ చెప్పేశాడు. విడాకుల విషయంపై హీరో సుమంత్‌ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. తనకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు. మా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఈ విషయంలో దురదృష్టం అని కూడా అనలేము. అలా జరుగుతున్నాయంతే. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ సర్ధుకుపోతున్నారు. రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ఒక నెగిటివ్ ముద్ర పడిపోతుందని చాలా మంది రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలని అంతా అనుకుంటున్నారని తెలిపారు. హీరో సుమంత్ మళ్లీ మొదలైంది అనే సినిమాని కంప్లీట్ చేశాడు. డివోర్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది ఈ మూవీ. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడాకుల పైన సుమంత్ స్పందిచాల్సి వచ్చింది. గతంలో తొలి ప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుమంత్. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. కీర్తిరెడ్డి రెండో పెళ్లి చేసుకుంది. కానీ సుమంత్ మాత్రం మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు.


Post a Comment

0Comments

Post a Comment (0)