దెబ్బకు దిగొచ్చిన హ్యుండాయ్ !

Telugu Lo Computer
0


హ్యుండాయ్ పాకిస్తాన్ కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు మద్దతుగా ఒక పోస్ట్ పెట్టింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఫిబ్రవరి 5వ తేదీన దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది కాశ్మీర్ సంఘీభావ దినాన్ని జరుపుకుంటారు ఆ దేశంలో. అయితే హ్యుండాయ్ పాకిస్తాన్ ఆ రోజున భారత్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టింది. మన కాశ్మీరి సోదరుల త్యాగాలను గుర్తు చేసుకుందామని, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదామని పేర్కొంది. అంతేకాదు, హ్యుండాయ్ పాకిస్తాన్, కాశ్మీర్ సాలిడరిటీడే అని ట్యాగ్స్ ఇచ్చింది. కాశ్మీర్ భారత్‌లో భాగం. అలాంటి కాశ్మీర్ పైన దాయాది పాకిస్తాన్ చేసే కుట్రలను సమర్థించేట్లుగా హ్యుండాయ్ పాకిస్తాన్ ట్వీట్ ఉండటం భారతావనికి ఆగ్రహం తెప్పించింది. దీంతో బాయ్‌కాట్ హ్యుండాయ్ అంటూ భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'హెలో హ్యుండాయ్, తీవ్రవాద పాకిస్తాన్‌కు మద్దతుగా ఎలా మాట్లాడుతారు, మా భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉండాలనుకుంటే ఇక్కడి నుండి వెళ్లిపోండి, హ్యుండాయ్ క్షమాపణలు చెప్పాలి లేదా వెళ్ళిపోవాలి, బ్రాండ్స్ ఇలా రాజకీయాల్లోకి రావడం ఏమిటి, ఇక హ్యుండాయ్ కాదు, హ్యుండై, తీవ్రవాద పాకిస్తాన్‌కు మద్దతుగా ఉంటే, భారతీయులు మీ ఉత్పత్తులు కొనడంపై పునరాలోచన చేస్తారు'.. ఇలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. భారతీయుల ఆగ్రహం నేపథ్యంలో కొరియాకు చెందిన కార్ల కంపెనీ దిగొచ్చింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని, 25 ఏళ్ళుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, కార్ల అమ్మకాల్లో సంస్థకు భారత్ రెండో ఇల్లు అని పేర్కొంది.హ్యుండాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ కూడా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తోందని, ఇక్కడి నుండే దక్షిణ అమెరికా దేశాలకు, మధ్య ఆసియా దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోందని హ్యుండాయ్ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)