క్లౌడ్ కంప్యూటర్ లో నిరుద్యోగులకు టెక్ మహీంద్రా ఉచిత శిక్షణ

Telugu Lo Computer
0


నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత క్లౌడ్ కంప్యూటర్ శిక్షణను అందించేందుకు ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా ముందుకు వచ్చింది. టెక్ మహీంద్రా కంపెనీకి చెందిన సీఎస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వబోతున్నది. ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రామ్‌ను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. క్లౌడ్ కంప్యూటరింగ్ 21వ శతాబ్దపు అద్భుత సాంకేతికత ఆవిష్కరణ అని టెక్ మహీంద్రా సీఈవో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కాలంలో అనేక వ్యాపారాలపై క్లౌడ్ మైగ్రేషన్ ను వేగవంతం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను మొత్తం 39 దేశాల్లో అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవడం ద్వారా 90 శాతం కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్‌లు నేరుగా ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని అన్నారు. మొత్తం 12 వారాలపాటు ఈ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్‌, మొహాలి, విశాఖ, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణేలోని టెక్ మహీంద్రా ద్వారా అందిస్తున్నట్టు పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)