అది రికవరీ కాదు రీఅడ్జస్ట్ : సజ్జల

Telugu Lo Computer
1


ఉద్యోగుల నుంచి జీతాలు రికవరీ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. వెంటనే ప్రభుత్వ ముఖ్య సలహాదారు అసలు రికవరీ అనేదే లేదని స్పష్టం చేశారు. ఎవరి దగ్గరా జీతాలు రికవరీ చేయడం లేదన్నారు. ఐఆర్ అంటే మధ్యంతర భృతి అనేది తాత్కాలిక అడ్జస్ట్ మెంట్ అని ఇప్పుడు రీఅడ్జస్ట్ మెంట్ చేస్తున్నాం కానీ రికవరీ కాదు అన్నారు. ఈ మాట విన్న తర్వాత ఉద్యోగులు జేబులో చేతులు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. రికవరీనా రీ అడ్జస్ట్ మెంటా అన్నది కాదు ఇచ్చిన జీతాలు వెనక్కి తీసుకుంటున్నారా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఖచ్చితంగా జీతాలు వెనక్కి తీసుకోవాలను కుంటున్న ప్రభుత్వం అందుకే అనేక రకాల తెలివి తేటల్ని ప్రదర్శిస్తోంది. జీవోలో ఎక్కడా రికవరీ లేదని ప్రభుత్వం చెబుతోంది. రీ అడ్జస్ట్ ఉంటుందన్నమాట. మొత్తంగా డీఏ బకాయిలన్నింటినీ ఈ ఐఆర్ తో కవర్ చేయాలని.. ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకూడదన్నది లక్ష్యం. దానికి తగ్గట్లుగానే సలహాదారులు తమ సలహాలను విస్తృతంగా వాడేస్తున్నారు. లెక్కల తెలివి తేటల్ని ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగులకు మైండ్ బ్లాంక్ చేస్తున్నారు.

Post a Comment

1Comments

  1. > "ఇప్పుడు రీఅడ్జస్ట్ మెంట్ చేస్తున్నాం కానీ రికవరీ కాదు"
    మాటల గారడీ. మడతమాటల గారడీ. ఒకసారి చెల్లించిన సొమ్మును ఏపేరు పెట్టి వెనుకకు తీసుకొనినా అది 'రికవరీ' అనే భావించవలసి ఉంది. న్యాయస్థానాన్ని బోల్తాకొట్టించటానికి అతితెలివిని ప్రదర్శించటం వలన న్యాయవ్యవస్థకు ఆగ్రహం‌కలిగే ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు గారు గ్రహించటం మంచిది. అసలు ప్రభుత్వ ముఖ్య సలహాదారు గారు ప్రభుత్వంతో మాటలాడాలే‌కాని నేరుగా మీడియాతోనో‌ ఉద్యోగులతోనో జనంతోనో మాటలాడటం అంత సముచితం కాదు. కాని ఆయనకు ఎవరు చెప్పగలరు? అసలు ఒకరు చెబితేవినే వారు ప్రస్తుతప్రబుత్వవర్గాల్లో ఎక్కడన్నా ఉన్నారా? చూదాం ఏం‌జరుగుతుందో!

    ReplyDelete
Post a Comment