ప్రతి పురుషుడు రేపిస్టా..?

Telugu Lo Computer
0


పార్లమెంట్ సమావేశాల్లో ఓ ఎంపీ వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పెళ్లినీ దౌర్జన్యపూరితమైనదిగా, ప్రతి పురుషుడినీ రేపిస్ట్‌గా విమర్శించడం సరైన విధానం కాదని తెలిపారామె. సీపీఐ సభ్యులు బినయ్ విశ్వం అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇవాళ రాజ్యసభలో మాట్లాడిన ఆమె. మహిళలు, బాలలను కాపాడటం అందరికీ ముఖ్యమైన విషయమేనని స్పష్టం చేశారు. కానీ, ప్రతి పెళ్లినీ, ప్రతి పురుషుడినీ విమర్శించడం మాత్రం సరికాదన్నారు. గృహ హింస నిర్వచనంపై గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్ 3ను, అదేవిధంగా అత్యాచారంపై ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిశీలించిందా? అనే అంశాన్ని తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నట్టు ఎంపీ బినయ్ విశ్వం తన ప్రశ్నలో పేర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చిన స్మృతి ఇరానీ ఈ దేశంలో ప్రతి పెళ్లిని ఓ దౌర్జన్యపూరతంగా ప్రతి పురుషుడినీ ఓ రేపిస్ట్‌గా విమర్శించడం సరైన పద్ధతి కాదని స్మృతి ఇరానీ అన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆమె. రాష్ట్రాల సహకారంతో మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా 30 హెల్ప్‌లైన్స్ పని చేస్తున్నాయి.. వాటి ద్వారా 66 లక్షల మంది మహిళలకు సహాయం అందిందని వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)