హైదరాబాద్‌కు డ్రిల్‌ మెక్ ?

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్‌ మెక్ కార్యాలయం ఏర్పాటు కానుంది. 200 మిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఆయిల్‌ రిగ్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ డ్రిల్‌ మెక్ , తెలంగాణ ప్రభుత్వం మధ్య నేడు అవగాహన ఒప్పందం జరుగనుంది. డ్రిల్‌మెక్ ఏర్పాటుతో కొత్తగా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా డ్రిల్‌మెక్‌ వ్యవహరిస్తోంది. తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గులను తయారు చేయనుంది. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా డ్రిల్‌మెక్‌ పేరు పొందింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో తెలంగాణలో భారీ ఉపాధి అవకాశాలు కలుగ నున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)