దక్షిణ కోస్తాకు వర్ష సూచన!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. శీతాకాలంలో ఓ వైపు మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయని, దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉండనుందో తెలిపింది. ఉత్తర కోస్తా లో ఈరోజు , రేపు , ఎల్లుండి మూడు రోజులు వాతావరణం పొడి గా ఉండ వచ్చు. దక్షిణ కోస్తా లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండ వచ్చు. రాయలసీమలో ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు, ఎల్లుండి వాతావరణం పొడి గా ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)