క్రియేటివ్‌గా ట్రై చేసి ఉద్యోగం కొట్టేశాడు...!

Telugu Lo Computer
0


యూకెకి చెందిన 24 ఏళ్ల జొనాథన్ అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ఆ దిశగా ప్రయత్నం చేశాడు. అనుకున్నట్లు గానే ఆ కంపెనీ యాజమాన్యం దృష్టిలో పడటమే కాదు, ఉద్యోగం కూడా సంపాదించాడు. జొనాథన్ స్విఫ్ట్ వృత్తిపరంగా ప్రింటింగ్ స్పెషలిస్ట్. కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో యూకెలోని యార్క్‌షైర్‌లో ఉన్న ప్రముఖ ప్రింటింగ్ కంపెనీ 'ఇన్‌స్టాప్రింట్'లో వేకెన్సీ ఉన్నట్లు తెలుసుకున్నాడు. అయితే అందరి లాగా కేవలం తన రెజ్యుమ్‌ను ఆ కంపెనీ మెయిల్‌కి ఫార్వార్డ్ చేసి ఊరుకోలేదు. ఆ కంపెనీ గతంలో ముద్రించిన ఫ్లయర్స్ (సింగిల్ షీట్ ప్రింట్స్)ను సేకరించి వాటిని రీసైకిల్ చేశాడు. ఆపై అవే ఫ్లయర్స్‌పై తన రెజ్యుమ్‌ను ప్రింట్ చేశాడు. ఆ తర్వాత ఒకానొక రోజు ఆ కంపెనీ పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లి అక్కడ పార్క్ చేసి ఉన్న ప్రతీ కారుపై తన రెజ్యుమ్‌ను ముద్రించిన ఫ్లయర్స్‌ను ఉంచాడు. అలా ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ క్రెయిగ్ వాసెల్ దృష్టిలో పడ్డాడు. క్రెయిగ్ వెంటనే జొనాథన్‌ను ఇంటర్వ్యూకి పిలిపించగా, ప్రింటింగ్ స్పెషలిస్ట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. దాదాపు 140 మంది ఆ ఉద్యోగానికి అప్లై చేయగా డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ప్రయత్నించిన జొనాథన్‌కే ఉద్యోగం రావడం విశేషం. జొనాథన్ ఆ కంపెనీ పార్కింగ్ ప్రదేశంలోని కార్లపై తన రెజ్యుమ్ ముద్రించిన ఫ్లయర్స్‌ను ఉంచుతున్న వీడియోని ఇన్‌స్టాప్రింట్ కంపెనీ తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)