ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన కేసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈరోజు కూడా కేసుల సంఖ్య భారీగానే నమోదయ్యింది. పండగకు ముందు రాష్ట్రంలో మరణాలు నమోదు కాలేదు. కేసులు పెరగడంతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46,650 పరీక్షలు నిర్వహించగా 14,440 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,80,634కి చేరింది. కరోనా వల్ల నిన్న నలుగురు మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు, గుంటూరులో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,542గా ఉంది. 24 గంటల వ్యవధిలో 3,969 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,82,482కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 83,610 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,21,47,031 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)