కరోనా కాలంలో అత్యధికంగా అమ్ముడైన డోలో 650

Telugu Lo Computer
0


కాస్త తల నొప్పిగా ఉన్నా, జ్వరంలా ఉన్నా వెంటనే ఒక డోలో వేసుకో సరిపోతుంది అనే మాట వచ్చేస్తుంది. అంతలా ఈ ట్యాబ్లెట్ అందరికీ అలవాటుగా మారిపోయింది. కరోనా కాలంలో డోలో 650కి విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. నిజానికి వైద్యుల సూచన లేకుండా ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిది కాదనే విషయం తెలిసినా కొందరు యధేశ్చగా వాడుతున్నారు. ఇక కరోనా ట్రీట్‌మెంట్ కోసం వైద్యులు కూడా ఈ మాత్రను సిఫార్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో దేశంలోనే అత్యధికంగా డోలో అమ్ముడైంది. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి  350 కోట్ల డోలో 650 మాత్రలు అమ్ముడయ్యాయి. ఈ మొత్తం ట్యాబ్లెట్లను పేర్చుకుంటే పోతే ఎవరెస్ట్ పర్వతం కంటే 6000 రెట్లు ఎక్కువ ఎత్తు ఉంటుందంట. అయితే కరోనాకు ముందు ఈ మెడిసిస్ సేల్స్ ఈ స్థాయిలో లేకపోవడం గమనార్హం. 2019లో భారత్‌లో 75 మిలియన్ స్ట్రిప్ల డోలో మాత్రలను విక్రయించగా ఒక్క 2021లోనే రూ. 307 కోట్ల టర్నోవర్ నమోదు కావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ట్యాబ్లెట్స్‌లో కాల్‌పోల్ మొదటి వరుసలో ఉండగా రెండో స్థానంలో డోలో 650 నిలిచింది. ఇటీవల డోలో 650 ట్యాబ్లెట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)